Thursday, 24 February 2011

నా ఈ ప్రపంచం


నా ఈ  ప్రపంచాని  గూర్చి
నేను  ఏమని  చెప్పను , ఎంతని  రాయను.....
శాంతికిపోతాలు  రెక్కలు తెగిపదిపోతున్నాయి...
నీతికి విల్లువలు తెగిపోతున్నాయి...
కుట్రలు, కుతంత్రాలకు  నివాసముగా  మారుతుంది 
తప్పులను  వేలెత్తి  చూపే దీపాల్లు  ఆరిపోతున్నాయి...
చిరుకాలపు  స్నేహాల  చిరునామాలు  లేవు 
చిరుదవాసాల పరిచయాలు  లేవు 
మనసారా  ఆదరించే  కంట  స్వరాలూ  లేవు 
పరుగులు  తీసే సమాజ  అసంగతాలు 
అనురాగాన్ని అమ్మకానికి  పెడుతున్న అరాచక పరాచకాలు 
విచిత్ర జీవన  గతులు 
దేన్ని గమనిచకుండా గడిచిపోయిన తేదీలను గుర్తుచేస్కుంటూ  హిమ్సిన్చుకుంటూన్నారు   
అవి మానవని  తెలుసు .... మారవని తెలుసు...
కానీ ఏం చేయను నిరీక్షించి నిరీక్షించి నిరీక్షించే మనస్సుతో    
నిజం కొంత  , అబ్ధం మరింత
నిరాశ  కొంత , ఆశ మరింత 
అంతులేని  ఈ ప్రపంచంలో చదరంగపు  పావులమై  
మనిషికి, మనసుకి  మద్య  మారిపోయే భవిష్యతు  ఒక మార్పుకై  
ప్రపంచ  శాంతికై  
స్నేహసముద్రపు ఉపెన కోసం తీరమై   వేచి చూస్తు
ప్రతి  ఒకరి కళలో కాంతులను  నింపాలని  ఆశిస్తూ 
                           - అశనా