ఏమని రాయాలి......ఎంతని రాయాలి......
ఏదో రాయాలని మనసు తొందరపెడుతున్న ఈ వేళ....
నా హృదయపులోతున జ్ఞాపకాల పుట్టలోని...
పున్నమి నాడు వెన్నెలలో చంద్రున్ని చూపిస్తూ నీవు తినిపించిన గోరుముద్దలు
నిదురపూచే నీవు చెప్పిన కాశీమజిలీ కథలు..
నా కోసం నీవు అనుభవించిన నిదురులేని ఆకలి రాత్రులు
నా అభివృధికి నీవు చేసిన త్యాగాలు,
గుర్తుకువచ్చి నా మనస్సుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి...
ప్రేమ,స్నేహం,ఓర్పు,సహనం,మమకారం నిలువెత్తు శిల్పమై నీ రూపంలో దివిపై వెలిసింది....
నా జీవితంలో హరివిల్లు విరవాలని నీవు కన్న కలలు నిజమైనాయి...
నా చదువుకి నీవ్వుచ్చిన ప్రేరణే.....
నన్నింత స్థాయికి తీసుకువచ్చింది....
కాని ప్రేరణే నన్ను ఇలా విదేశాలికీ తీసుకువెళ్ళి....
నిన్ను నాకై నిరీక్షించే స్తితికి తీసుకువచ్చింది....
నాకు ఏమీ వద్దు....ఎటువంటి అంతస్థులు వద్దు....
నీ వొడిలో ప్రశాంతంగా కునుకు తీసే అవకాశం చాలు అమ్మ